ముత్తారం మండల బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జిగా ఊట్ల శ్రీను నియామకం.
పుట్ట మధూకర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఊట్ల శ్రీను…
అర్జున్ సమాచారం,నవంబర్ 20.ముత్తారం రిపోర్టర్ ..
మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నవంబర్ 19న నిర్వహించారు. ఈ సమావేశంలో ముత్తారం మండల బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జిగా ఊట్ల శ్రీనుకు బాధ్యతలు అప్పగించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తి నిబద్ధతతో నిర్వహిస్తూ పుట్ట మధన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు.
అలాగే ముత్తారం మండల బీఆర్ఎస్ నాయకులందరి సలహాలు, సూచనలు, సహకారంతోనే తనకు ఈ అవకాశం లభించిందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్‌తో పాటు ముత్తారం మండల బీఆర్ఎస్ నాయకులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.

