ePaper
Friday, November 20, 2026
ePaper
Homeతెలంగాణముత్తారం మండల బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జిగా ఊట్ల శ్రీను నియామకం.

ముత్తారం మండల బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జిగా ఊట్ల శ్రీను నియామకం.

📰 Generate e-Paper Clip

ముత్తారం మండల బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జిగా ఊట్ల శ్రీను నియామకం.

పుట్ట మధూకర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఊట్ల శ్రీను…

అర్జున్ సమాచారం,నవంబర్ 20.ముత్తారం రిపోర్టర్ ..

మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నవంబర్ 19న నిర్వహించారు. ఈ సమావేశంలో ముత్తారం మండల బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్‌చార్జిగా ఊట్ల శ్రీనుకు బాధ్యతలు అప్పగించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తి నిబద్ధతతో నిర్వహిస్తూ పుట్ట మధన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు.

అలాగే ముత్తారం మండల బీఆర్ఎస్ నాయకులందరి సలహాలు, సూచనలు, సహకారంతోనే తనకు ఈ అవకాశం లభించిందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్‌తో పాటు ముత్తారం మండల బీఆర్ఎస్ నాయకులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!