ePaper
Saturday, November 21, 2026
ePaper
Homeతెలంగాణప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీలో భారీగా నియామకాలు - వ్యవసాయ వర్సిటీలో 566 అధ్యాపక పోస్టుల భర్తీకి...

ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీలో భారీగా నియామకాలు – వ్యవసాయ వర్సిటీలో 566 అధ్యాపక పోస్టుల భర్తీకి ఆమోదం – ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం – రాతపరీక్షతో పాటు ఇంటర్వ్యూలు తప్పనిసరని స్పష్టీకరణ – త్వరలో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీకి వర్సిటీ సన్నాహాలు

📰 Generate e-Paper Clip

తెలంగాణలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. వర్సిటీలో మొత్తం 566 బోధనా సిబ్బంది
పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో 48 ప్రొఫెసర్, 148 అసోసియేట్ ప్రొఫెసర్, 370 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి.
రాష్ట్రంలో కొత్తగా వ్యవసాయ కళాశాలల ఏర్పాటు, నూతన కోర్సుల ప్రవేశం, అత్యాధునిక పరిశోధనా కేంద్రాల ప్రారంభం వంటి కారణాలతో వర్సిటీలో అధ్యాపకుల అవశ్యకత పెరిగింది. ఈ నేపథ్యంలో ఖాళీలను
తక్షణమే భర్తీ చేయాలని కోరుతూ విశ్వవిద్యాలయం ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని పరిశీలించిన ప్రభుత్వం, ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
నియామక ప్రక్రియ పారదర్శకంగా సాగాలన్న ఉద్దేశంతో, కేవలం రాత పరీక్ష ఆధారంగానే ఈ పోస్టులను భర్తీ చేయాలని, ఇంటర్వ్యూలను మినహాయించాలని వర్సిటీ పాలకమండలి ప్రభుత్వాన్ని కోరింది.
అయితే, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్) నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించడం తప్పనిసరని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇంటర్వ్యూలు లేకుండా నియామకాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని ముఖ్యమంత్రి కార్యాలయం, ఆర్థిక శాఖ తేల్చిచెప్పాయి.  ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించడంతో, విశ్వవిద్యాలయం త్వరలోనే
అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!