ePaper
Tuesday, November 24, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్దేశంలోనే అతిపెద్ద బహుళ-రంగ ప్రదర్శనగా ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ * రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో...

దేశంలోనే అతిపెద్ద బహుళ-రంగ ప్రదర్శనగా ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ * రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మిట్ లలో 80 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో అతిపెద్ద బహుళ-రంగ ఎక్స్ పో * సమ్మిట్‌లో భాగంగా రక్షా ఎక్స్‌పో, ఇండియా జాయ్, స్టార్టప్ పెవిలియన్, ట్రైబల్ సమ్మిట్, తెలంగాణ పెవిలియన్, ఎడ్యుకేషన్ ఎక్స్‌పో, క్లైమేట్ కాంక్లేవ్‌ * ⁠ప్రపంచ స్థాయి విద్యావేత్తలతో ప్రత్యేక చర్చలో పాల్గొననున్న సీఎం * ప్రతినిధుల కోసం పకడ్బందీ ఏర్పాట్లు, ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా సునాయాసంగా ప్రవేశం * ప్రపంచం నలుమూలల నుంచి వెయ్యికి పైగా కంపెనీల ప్రతినిధుల రాక కోసం రంగం సిద్ధం

📰 Generate e-Paper Clip

హైదరాబాద్:అర్జున్ సమాచారం:
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మిట్ లలో 80 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో అతిపెద్ద బహుళ-రంగ ఎక్స్ పో గా ఈ సమ్మిట్ ను చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సమ్మిట్ ఏర్పాట్లపై సోమవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో మంత్రి డి. శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్న సమ్మిట్ ఏర్పాట్ల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమ్మిట్ వేదిక, వివిధ హాల్స్, అంతర్జాతీయ ప్రతినిధుల ఆహ్వానాలు, కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. సమ్మిట్‌లో భాగంగా రక్షా ఎక్స్‌పో, ఇండియా జాయ్, స్టార్టప్ పెవిలియన్, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ ఎక్స్‌పో, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రదర్శన, తెలంగాణ పెవిలియన్, ఎడ్యుకేషన్ ఎక్స్‌పో, క్లైమేట్ కాంక్లేవ్‌ల నిర్వహణపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.
పెట్టుబడులు, పరిశ్రమలు, ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యమిస్తూ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. అన్ని రంగాలనుంచి వెయ్యికి పైగా కంపెనీలు పాల్గొననున్నాయి. సమ్మిట్‌కు పెద్ద ఎత్తున ప్రతినిధులు హాజరయ్యే అవకాశమున్నందున ప్రతినిధులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా సునాయాసంగా ప్రవేశం కోసం ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వాడాలన్నారు. ఆహ్వానాలు పంపే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతినిధులతో అత్యంత మర్యాదగా వ్యవహరించేలా విధుల్లో ఉన్న అధికారులకు శిక్షణ ఇవ్వాలన్నారు.
తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కాకతీయుల శిల్పకళ, సమ్మక్క సారలమ్మ ఆలయంలో ఉన్న తోరణాల నమూనాలు, సోమశిల ఆలయం, నిర్మల్ పెయింటింగ్స్, రాష్ట్రానికి చెందిన భౌగోళిక గుర్తింపు ఉన్న ఉత్పత్తులు, చేనేత, రాష్ట్ర అభివృద్ధి, గాంధీ సరోవర్ ప్రాజెక్టు తదితర భవిష్యత్ ప్రణాళికలను ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు జయేష్ రంజన్, నవీన్ మిత్తల్, హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, గ్లోబల్ సమ్మిట్ అధికారుల కమిటీల సభ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు
===========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!