ePaper
Sunday, November 29, 2026
ePaper
Homeసినిమావిశ్వక్ సేన్ ‘లెగసీ’ సినిమా షూటింగ్ పూర్తి

విశ్వక్ సేన్ ‘లెగసీ’ సినిమా షూటింగ్ పూర్తి

📰 Generate e-Paper Clip

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘లెగసీ’ షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. సాయికిరణ్ రెడ్డి దైదా రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి, సాయికిరణ్ రెడ్డి దైదా నిర్మిస్తున్నారు.
ప్రధాన చిత్రీకరణ పూర్తికావడంతో సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి అడుగుపెట్టింది. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని 2027 ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘పిండం’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయికిరణ్ రెడ్డి దైదాకు ‘లెగసీ’ రెండో దర్శకత్వ చిత్రం. అలాగే కళాహి మీడియా సంస్థకు ఇది రెండో నిర్మాణ చిత్రం కావడం విశేషం.
రాజకీయ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రం అధికారం, ఆశయం, కుటుంబ బంధాలు, ప్రేమ, ద్రోహం వంటి బలమైన అంశాల చుట్టూ సాగుతుంది. తన తండ్రి రాజకీయ వారసత్వం కారణంగా అనూహ్య పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిన ఓ వారసుడి జీవిత ప్రయాణమే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. రాజకీయాల ప్రభావం వ్యక్తిగత జీవితాలపై ఎలాంటి పరిణామాలను చూపిస్తుందనే అంశాన్ని ఆసక్తికరంగా ఆవిష్కరించనున్నారు.
ఈ చిత్రంలో విశ్వక్ సేన్ మునుపెన్నడూ చూడని పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపించనున్నారు. ప్రముఖ నటుడు కే కే మీనన్ శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండగా, ఏక్తా రాథోడ్ కథానాయికగా నటిస్తున్నారు.
రావు రమేష్, సచిన్ ఖేడేకర్, మురళీ మోహన్, రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల, అనీష్ కురువిల్లా, ఖుషీ రవి, కల్యాణి నటరాజన్, రవి కాలే, అమిత్ తివారి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్పటికే విడుదలైన అనౌన్స్‌మెంట్ టీజర్‌తో పాటు ఇతర ప్రచార చిత్రాలు ‘లెగసీ’ ప్రపంచంపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.
ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం అందిస్తుండగా, జిజు సన్నీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సిరీష్ ప్రసాద్ ఎడిటర్‌గా, రాజీవ్ నాయర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, స్టంట్ జశువా యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
షూటింగ్ పూర్తిచేసుకున్న ‘లెగసీ’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో విడుదలకు సిద్ధమవుతోంది. 2027 ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!