ePaper
Sunday, July 5, 2026
ePaper
HomeతెలంగాణGHMC గంజాయి తరలిస్తున్న వ్యక్తులు అరెస్టు

 గంజాయి తరలిస్తున్న వ్యక్తులు అరెస్టు

📰 Generate e-Paper Clip

 గంజాయి తరలిస్తున్న వ్యక్తులు అరెస్టు

మేడ్చల్, అర్జున్ సమాచారం 27 june 2026
గంజాయి తరలిస్తున్న వ్యక్తులను పట్టుకున్న మేడ్చల్ పోలీసులు మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై మేడ్చల్ పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. మహారాష్ట్రలోని జల్నా జిల్లాకు చెందిన సచిన్

సంతోష్ జాదవ్ అలియాస్ నితిన్ అలియాస్ ఆకాష్ (24), రాజేష్ మాధవ్ చౌదరి (22)లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 5.849 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ధ్రువ కళాశాల రోడ్డు,

ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెం.06 సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, గంజాయితో పాటు ఒక మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి

గంజాయిని తీసుకొచ్చి మేడ్చల్‌లో అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో నిందితులను కోర్టులో హాజరుపరచగా, గంజాయి సరఫరా మూలాలు మరియు ఈ అక్రమ

రవాణా నెట్‌వర్క్‌కు సంబంధించిన ఇతర వ్యక్తుల కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!