రాయచోటి ,అర్జున్ సమాచారం:
జిల్లాలో ఖజానాకు ఆదాయం పెంపు కోసం ఆదాయార్జన శాఖలన్ని సమన్వయంతో పని చేసి లక్ష్యాలను అధిగమించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.శనివారం మదనపల్లి కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్, రవాణా, మైనింగ్, రిజిస్ట్రేషన్, అటవీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ శాఖల వారీగా ఆదాయ సాధన పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.జిల్లాలో ఆదాయం పెంపు కోసం సంబంధిత శాఖలన్నీ పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించు కోవాలన్నారు. జిల్లాలో పన్నుల వసూళ్లలో పారదర్శకత, సమర్థత పెంపుతో పాటు ఆదాయ వృద్ధి సాధించడం లక్ష్యంగా అధికారులు కట్టుదిట్టంగా పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖపై సమీక్షిస్తూ.. చీప్ లిక్కర్, సారాను పూర్తిగా అరికట్టాలన్నారు. మద్యం దుకాణాలలో, బార్లలో సీసీటీవీల పనితీరును పర్యవేక్షించి అవకతవకలు జరగకుండా చూడాలని చెప్పారు. పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు నుంచి అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని, విజిలెన్స్ అధికారులు రూట్ వాచ్ మరింత పెంచి అప్రమత్తంగా ఉండాలని దీనిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు. అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. తండాలలో రైట్స్ చేసే సమయంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో సమన్వయం చేసుకొని మద్యానికి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలైనట్లుగా గుర్తిస్తే అటువంటి వారిని రీ హ్యాబిటేషన్స్ సెంటర్ చెప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.మున్సిపల్, పంచాయతీరాజ్ పనుల్లో జీఎస్టీ వసూళ్లు తప్పనిసరిగా జరిగేలా చూడాలని, బిల్లులు ప్రాసెస్ చేసే సమయంలో జీఎస్టీ యాక్టివ్ స్థితిని పరిశీలించాలని ఆదేశించారు. మండల అభివృద్ధి అధికారులు, గ్రామపంచాయతీలకు జీఎస్టీ రిజిస్ట్రేషన్‌పై అవగాహన కల్పించి, అందరూ రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీ పంచాయతీ పరిధిలోని లేఅవుట్ గుర్తించి వాటిని రెగ్యులరైజ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, టాక్స్ వసూలుకు సంబంధించి అసెస్మెంట్ చేసి పూర్తిస్థాయిలో లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు.రిజిస్ట్రేషన్ శాఖ వారు స్లాట్ ప్రకారం రిజిస్ట్రేషన్స్ పూర్తి చేయాలని , రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులకు ఆన్లైన్ సేవలు గురించి అవగాహన కల్పించాలని అలాగే ఆన్లైన్ సేవలపై వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని ఎక్కడ ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా చూడాలని అన్నారు. జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది ఖాళీల వివరాలను తెలపాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఆదేశించారు.ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.స్వరాజ్య సంగ్రామ చరిత్రలో అల్లూరి ఒక మహోజ్వల శక్తి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు దేశభక్తి, ధైర్యాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని నిశాంత్ కుమార్
పేర్కొన్నారు. శనివారం మదనపల్లి కలెక్టరేట్లో లోని పి జి ఆర్ ఎస్ హాల్ నందు పర్యాటక మరియు యువజన సర్వీసుల శాఖ ల ఆధ్వర్యంలో శ్రీ అల్లూరి సీతారామరాజు 129 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 1897 జూలై 4న విశాఖపట్నం జిల్లా పాండ్రంగి గ్రామంలో జన్మించిన అల్లూరి సీతారామరాజు చిన్న వయస్సులోనే దేశభక్తి భావాలతో ప్రజల పక్షాన నిలిచారని తెలిపారు. బ్రిటిష్ పాలనలో గిరిజనులపై జరుగుతున్న అన్యాయాలు, అణచివేత, వారి హక్కుల అణిచివేతను
గుర్తించి వాటికి వ్యతిరేకంగా పోరాటానికి శ్రీకారం చుట్టారని తెలియజేశారు.1922 నుండి 1924 వరకు తూర్పు కనుమల అటవీ ప్రాంతాల్లో గిరిజనులను ఏకం చేసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాహసోపేతమైన గెరిల్లా పోరాటాన్ని నడిపారని పేర్కొన్నారు. ఆయుధాలు, వనరులు తక్కువగా ఉన్నప్పటికీ విల్లు, బాణాలతోనే శక్తివంతమైన బ్రిటిష్ సైన్యాన్ని సవాలు చేయడం ఆయన అసాధారణ ధైర్యసాహసాలకు నిదర్శనమని కొనియాడారు. వీరి ఫలితమే 1882లో అమల్లోకి వచ్చిన మద్రాస్ ఫారెస్ట్ చట్టం వల్ల గిరిజనుల జీవనాధారమైన అటవీ ఉత్పత్తుల సేకరణపై ఆంక్షలు విధించడంతో వారు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తించి, వారి హక్కుల పరిరక్షణ కోసం అల్లూరి పోరాడారని తెలిపారు. ఆయన ఉద్యమాన్ని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం భారీ ఎత్తున బలగాలను మోహరించి, భారీ వ్యయం ఖర్చు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.అల్లూరి సీతారామరాజును పట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం బహుమతి ప్రకటించడం ఆయన పోరాట తీవ్రతకు నిదర్శనమని కలెక్టర్ అన్నారు. చివరకు 1924 మే నెలలో ఎలాంటి విచారణ, న్యాయ ప్రక్రియ లేకుండానే ఆయనను పట్టుకుని కాల్చి చంపడం భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ఒక విషాద ఘట్టమని పేర్కొన్నారు.దేశం కోసం, ప్రజల హక్కుల కోసం తన ప్రాణాలను అర్పించిన అల్లూరి సీతారామరాజు త్యాగం చిరస్మరణీయమని, ఆయన ధైర్యం, దేశభక్తి, న్యాయం కోసం పోరాడే తత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు.మన్యం వీరుడు అల్లూరి స్వాతంత్య్రం కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన మహనీయుడన్నారు. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులకు అండగా నిలిచి బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడని, ఆయన చూపిన ధైర్యం తెగువ భావితరాలకు ఆదర్శం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారి నాగభూషణం,యువజన సర్వీసుల శాఖ పర్యవేక్షణ అధికారి వివి నారాయణ, నాగయ్య, కలెక్టర్ కార్యాలయం నాగభూషణం, కలెక్టర్ కార్యాలయం సిబ్బంది వివిధ శాఖల జిల్లా అధికారులు, విద్యార్థులు,సిబ్బంది పాల్గొన్నారు.
అక్రమ మద్యం రవాణాపై గట్టి నిఘా రాయచోటి .
RELATED ARTICLES
