హైదరాబాద్ ,అర్జున్ సమాచారం :
గురువారం హైదరాబాద్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లనూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు,
బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల నటన అద్బుతం. ప్రతి వారం ముందే రిహార్సల్ చేసి పోటాపోటీగా నటనలో జీవిస్తున్నారని వ్యాఖ్యానించారు.
అబద్దాలకు ఆస్కార్ అవార్డు ఇస్తే ఇద్దరూ అర్హులే. అయినా తెలంగాణ ప్రజలేమైనా ఎడ్డోళ్లనుకుంటున్నారా? మిమ్ముల్ని చూసిన నవ్వుకుంటున్నారు. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో డేట్, టైం,వేదిక ఫిక్స్ చేస్తాం. గురుకులాల టెండర్లు, తెలంగాణ అప్పులతోపాటు అవినీతి,అక్రమాలపైనా చర్చిద్దాం రండని అన్నారు.
ప్రజల ప్రశ్నలకు జవాబిచ్చేందుకు సిద్దమా, కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలను ప్రజల ముందుంచేందుకు మేం రెడీ. మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివ్రుద్ధికి ఖర్చు చేసిన నిధులు, అందించిన సంక్షేమ కార్యక్రమాలపైనా చర్చిద్దాం రండి. మీరు ఇట్లనే డ్రామాలాడితే జనం ఛీ కొట్టడం ఖాయం. ఈ రాజకీయ బిగ్ బాస్ షోలో ప్రజలు డబుల్ ఎలిమినేషన్ కోరుకుంటున్నారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ఆకాంక్షిస్తున్నారని అయన ఎక్స్ వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతల తీరును ఎండగట్టారు.

