కరీంనగర్,అర్జున్ సమాచారం:
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి ఉన్న వజ్రాయుధమని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ కూన శ్రీశైలం గౌడ్ పిలుపునిచ్చారు.
శుక్రవారం బెజ్జంకి మండలం గుగ్గిళ్ళ గ్రామంలో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ఓటరు నమోదు కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, కొత్తగా ఓటు హక్కు పొందిన యువతీయువకులు, ఇళ్లు మారిన వారు, ఇంకా ఓటరు జాబితాలో పేరు లేని వారు వెంటనే దరఖాస్తు చేసుకొని పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. బూత్ స్థాయి అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.
బీజేపీ కుట్రలను భగ్నం చేయాలి :
కవ్వంపల్లి
మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఓట్ల తొలగింపుతో అధికారంలోకి ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. తమకు వ్యతిరేవర్గానికి చెందిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలన్నదే కుట్రలో భాగమని ఆయన పేర్కొన్నారు. బీజేపీయేత రాష్ట్రాల్లో అధికారాన్ని పగ్గాలు చేపట్టాలనే ఉద్దేశంతోనే సర్ ప్రక్రియను చేపట్టిందని ఆయన ఆరోపించారు. అర్హులవారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగింపునకు గురికాకుండా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో బెజ్జంకి ఎంపీడీవో కె.ప్రవీణ్, తహశీల్దార్ శ్రీకాంత్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చెట్టి రాజు, జిల్లా కార్యదర్శి అక్కరవేణి పోచయ్య ముదిరాజ్, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, పార్టీ గుగ్గిళ్ల గ్రామశాఖ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, పార్టీ నాయకులు బైర సంతోష్, చెప్యాల శ్రీనివాస్ గౌడ్,చెన్నారెడ్డి, రావుల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు .
=============================

