ePaper
Friday, August 21, 2026
ePaper
Homeతెలంగాణకరీంనగర్హిందువులారా జాగోరే సర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోంది కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్

హిందువులారా జాగోరే సర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోంది కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్

📰 Generate e-Paper Clip

కరీంనగర్,అర్జున్ సమాచారం:
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోంది
ఇదే జరిగితే తెలంగాణలో హిందువులే మైనారిటీలయ్యే ప్రమాదం
అధికారులకు ప్రభుత్వం సహకరించడం లేదు,
మజ్లిస్ తో కుమ్కక్కై కాంగ్రెస్ హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోంది.
కష్టపడి పనిచేసి క్షేత్రస్థాయి నుండి ఎదిగే లీడర్ ను సమాజం గౌరవిస్తుంది
20 ఏళ్ల రేవంత్ రాజకీయ జీవితానికి శుభాకాంక్షలు.
6 గ్యారంటీలను అమలు చేయాలని కోరుతున్నా.
అప్పులు, అవినీతి, అక్రమాలు తప్ప చేసిందేమీ లేదు
కేంద్ర నిధులతోనే తెలంగాణలో అభివ్రుద్ధి
కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులు చేసింది శూన్యం.
రెండు పార్టీలు కలిసి రూ.10 లక్షల అప్పు చేసి జనంపై భారం మోపారు
తెలంగాణను శ్రీలంక, పాకిస్తాన్ లా మార్చే ప్రమాదం
గ్రామాల అభివ్రుద్ధి కోసం కేంద్రం 14, 15 ఆర్ధిక సంఘం నిధులిస్తే జీతాలిస్తూ డైవర్ట్ చేస్తున్నారు.
అప్పుల ఊబి నుండి బయటకు రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే
వీబీజీ రామ్ జీ పథకంతో పనిదినాలు పెంచి ఆస్తులు స్రుష్టించడం తప్పా,
దీనిపై కోర్టుకు వెళ్లడం ఏంది
మోదీకి మంచి పేరొస్త్తే ఓర్వలేరా?
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైర్:
వేములవాడ నియోజకవర్గంలో పలు అభివ్రుద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి
రాష్ట్ర ప్రభుత్వం ‘‘సర్’’ ను ఉపయోగించుకుని హిందువల ఓట్లను తొలగించేందుకు పెద్ద ఎత్తున కుట్ర చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. సర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు సహకరించడం లేదన్నారు. ఫలితంగా అధికారులు క్షేత్రస్థాయిలో హిందువుల ఇండ్లకు పూర్తిస్థాయిలో వెళ్లడం లేదన్నారు. తెలంగాణలోని హిందువులంతా జాగ్రుతం కావాలని, లేనిపక్షంలో తెలంగాణలో హిందువులంతా మైనారిటీలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
వేములవాడ నియోజకవర్గంలో మేడిపల్లి, బీమారం, కథలాపూర్ మండలాల్లో చేపట్టిన పలు అభివ్రుద్ది కార్యక్రమాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. అందులో భాగంగా కాచారం గ్రామంలో 18 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డు ప్రారంభించారు. మరో  10లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. దమ్మన్నపేట గ్రామంలో 8 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు పనులకు  శంకుస్థాపన చేశారు.
రేవంత్ కు శుభాకాంక్షలు.
కష్టపడి పనిచేసి క్షేత్రస్థాయి నుండి ఎదిగే లీడర్ ను సమాజం గౌరవిస్తుంది అందులో భాగంగా 20 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు. కేసీఆర్ కూడా కష్టపడి పైకొచ్చిన నాయకులే. కానీ ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని కోరుతున్నా.
===========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!