కరీంనగర్,అర్జున్ సమాచారం:
కరీంనగర్ శాతవాహన పట్టణ అభివృద్ధి సంస్థ సుడ బాధ్యతలు జిల్లా కలెక్టర్ చేతుల్లోకి వెళ్లాయి ఇప్పటివరకు చైర్మన్గా ఉన్న కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పదవీకాలం బుధవారంతో ముగిసింది. గురువారం కొత్త సుడా చైర్మన్ ను ఎన్నుకుంటారేమో అని వేచి చూశారు కొంతమంది నాయకులు. దీంతో ప్రభుత్వం కొత్త కమిటీని నియమించే వరకు కలెక్టరే ఇన్చార్జిగా వ్యవహరించనున్నారు ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందింది పట్టణాభివృద్ధి సంస్థలో తదుపరి కార్యాచరణ పై కలెక్టర్ దృష్టి సారించనున్నారు
=============================
