ePaper
Thursday, July 9, 2026
ePaper
Homeతెలంగాణకరీంనగర్రైతులు వ్యవసాయ పంటల సాగు సీజన్‌లో అప్రమత్తంగా ఉండాలి... జమ్మికుంట వ్యవసాయ...

రైతులు వ్యవసాయ పంటల సాగు సీజన్‌లో అప్రమత్తంగా ఉండాలి… జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం..

📰 Generate e-Paper Clip

జమ్మికుంట,అర్జున్ సమాచారం:

ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో వ్యవసాయ సాగు సీజన్ ప్రారంభమైన సందర్భంగా రైతులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న- సదానందం, రైతులకు సూచించారు. ప్రభుత్వం అనుమతి పొందిన ఎరువుల దుకాణాల్లోనే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని తప్పనిసరిగా కొనుగోలు చేసిన రసీదు బిల్లును భద్రపరుచుకోవాలని రైతులకు సూచించారు. నకిలీ విత్తనాలు ఎరువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అనుమానం వచ్చిన వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
ఎరువుల దుకాణాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎరువులను నిర్ణీత ధరలకే విక్రయించాలని కృత్రిమ కొరత సృష్టించడం అధిక ధరలకు విక్రయించడం బిల్లులు ఇవ్వకుండా అమ్మకాలు నిర్వహించడం వంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. దుకాణాల్లో ధరల జాబితా స్పష్టంగా ప్రదర్శించాలని తగిన నిల్వలను ఉంచి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వారు సూచించారు…
==========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!