కరీంనగర్,అర్జున్ సమాచారం:
కరీంనగర్ నగరాన్ని సందర్శించిన ఉత్తరప్రదేశ్ జలశక్తి శాఖ క్యాబినెట్ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్‌కు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా నగరాభివృద్ధి, మౌలిక వసతులు, తాగునీటి నిర్వహణ, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ, కరీంనగర్ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధితో దేశంలోని అభివృద్ధి చెందుతున్న నగరాల సరసన నిలిచే సామర్థ్యం కలిగి ఉందని ప్రశంసించారు. నగరాభివృద్ధికి ప్రజాప్రతినిధులు చూపుతున్న కృషిని అభినందించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వివరించగా, కరీంనగర్‌ను దేశంలో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఏపీపీ చంద్ర, బీజేపీ నాయకులు భారీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.
