ePaper
Saturday, July 11, 2026
ePaper
Homeతెలంగాణకరీంనగర్శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాల నిఘా అత్యంత కీలకం: కరీంనగర్ సీపీ గౌష్ ఆలం

శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాల నిఘా అత్యంత కీలకం: కరీంనగర్ సీపీ గౌష్ ఆలం

📰 Generate e-Paper Clip

కరీంనగర్,అర్జున్ సమాచారం:
కరీంనగర్ రూరల్ డివిజన్ పరిధిలో 21 నూతన సీసీ కెమెరాలను ప్రారంభించిన పోలీస్ కమిషనర్
కమిషనరేట్ వ్యాప్తంగా మరో 700 కెమెరాల ఏర్పాటు లక్ష్యం.
యువత డ్రగ్స్, సైబర్ గేమింగ్ అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలపై దృష్టి సాధించాలి. రోడ్డు ప్రమాద బాధితులను కాపాడితే ‘రహవీర్’ పథకం ద్వారా రూ.25 వేల బహుమతి
తిమ్మాపూర్ సర్కిల్  గన్నేరువరం:
శాంతిభద్రతల పరిరక్షణలో మరియు నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా సీసీటీవీ కెమెరాల పాత్ర అత్యంత కీలకమని కరీంనగర్ పోలీస్ కమిషనర్  గౌష్ ఆలం, పేర్కొన్నారు.
కరీంనగర్ రూరల్ డివిజన్ పరిధిలోని ఖాసీంపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 9 సీసీ కెమెరాలను, పరువెల్ల గ్రామంలోని 8 సీసీ కెమెరాలను, గునుకుల కొండాపూర్ గ్రామంలో 4 కెమెరాలను ఆయన శుక్రవారం ప్రారంభించారు.
అనంతరం గన్నేరువరం పోలీసుల ఆధ్వర్యంలో  ఖాసీంపేటలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ సీపీ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఖాసీంపేటలో విద్యార్థులు, ప్రజలతో ఏర్పాటు చేసిన విస్తృత అవగాహన సదస్సులో సీపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయకుమార్, తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్,గన్నేరువరం ఎస్సై ఆవుల నరేందర్ రెడ్డిలతో పాటు స్థానిక పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.
============================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!