కోదాడ,అర్జున్ సమాచారం:
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.
కోదాడ నియోజకవర్గ కేంద్రం అధునాతన హంగులతో నూతన ఆర్టీసీ బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకొని భూమిపూజ చేసుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.
ప్రజా పాలన ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో ముఖ్యమైన ప్రాంతాల్లో ఆర్టీసీ బస్ స్టేషన్ లను నిర్మించడానికి ప్రత్యేక ప్రణాళిక ద్వారా ముందుకు పోతున్నాం.
ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడగానే 48 గంటల్లో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించాం.
ఇప్పటివరకు 327 కోట్ల మంది మహిళలు జీరో టికెట్స్ ఉపయోగించుకున్నారు
దాదాపు 11400 కోట్ల పైన ఉచిత ప్రయాణం చేసి డబ్బులు ఆదా చేసుకున్నారు
రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు.
రాష్ట్రంలో 65 లక్షల మంది ఆర్టీసీలో ప్రతిరోజు ప్రయాణం చేస్తుంటే అందులో 35 లక్షల మంది అక్కా చెల్లెల్లు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు
రాఖీ పౌర్ణమి రోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా అక్క చెల్లెలు ప్రయాణం చేశారు.
ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి ప్రయాణికుల సౌలభ్యం మూడు అంశాలు ప్రాధాన్యత గా నడుస్తుంది
కొత్త నియామకాలు చేపడుతున్నాము కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నాము కారుణ్య నియమాకాలు చేపట్టాం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆర్టీసీ కి సహకారం అందిస్తున్నారు.
తెలంగాణ ఆర్టీసీని దేశంలోనే నంబర్-1 ప్రజా రవాణా సంస్థగా తీర్చిదిద్దుతాం
దేశంలోనే ఎక్కడ లేని విధంగా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడమే కాదు మహిళలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసిన ఘనత ప్రభుత్వంది.
గ్రామ గ్రామాన ఎక్కడ బస్సులు అవసరం ఉంటే అక్కడికి బస్సులు నడుపుతుంది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు గా ఉన్నప్పుడు నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేశా సీనియర్ రాజకీయ నాయకులు నిరంతరం మీకోసం పని చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి,ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి,జిల్లా కలెక్టర్,ఇతర ముఖ్య నేతలు,అధికారులు పాల్గొన్నారు
=============================
