ePaper
Saturday, July 11, 2026
ePaper
Homeతెలంగాణమహబూబ్​నగర్కోర్టు కేసుల సత్వర విచారణకు సమన్వయంతో పనిచేయాలి కోర్టు డ్యూటీ అధికారులు, కోర్టు లైజన్ అధికారులతో...

కోర్టు కేసుల సత్వర విచారణకు సమన్వయంతో పనిచేయాలి కోర్టు డ్యూటీ అధికారులు, కోర్టు లైజన్ అధికారులతో సమీక్ష సమావేశం బాధితులకు సత్వర న్యాయం అందేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి – జిల్లా ఎస్పీ డి.జానకి,

📰 Generate e-Paper Clip

మహబూబ్‌నగర్ జిల్లా, అర్జున్ సమాచారం:                                                                                                     మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి.జానకి, రు పోలీసు ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ నందు కోర్టు డ్యూటీ అధికారులు మరియు కోర్టు లైజన్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ, కోర్టు విచారణలో ఉన్న కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సాక్షులు సకాలంలో కోర్టుకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా తీవ్రమైన నేరాలు, మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాలు, పోక్సో, హత్య, దోపిడీ తదితర కేసుల విచారణలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
కోర్టు డ్యూటీ అధికారులు, కోర్టు లైజన్ అధికారులు, దర్యాప్తు అధికారులు మరియు ప్రభుత్వ అభియోగ న్యాయవాదుల మధ్య సమన్వయం మరింత మెరుగుపరచి, కేసులలో నిందితులకు శిక్షలు పడేలా పటిష్టమైన సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న కోర్టు సమన్లు, వారెంట్లు, ప్రొక్లమేషన్ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
కేసుల పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ, బాధితులకు సత్వర న్యాయం అందేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీసూచించారు. ఈ సమీక్ష సమావేశం నందు DCRB DSP రమణా రెడ్డి, DCRB ఇన్స్పెక్టర్ నర్సింలు, IT సెల్ SI రవి, కోర్టు లైజన్ అధికారులు మరియు కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నా
==========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!