హైదరాబాద,అర్జున్ సమాచారం:
వియత్నాం పర్యటనకు వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు పర్యాటకులు అక్కడ బోటు ప్రమాదంలో మరణించారనే సమాచారంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వియత్నాంలోని ఫూ క్వాక్ ద్వీపంలో పర్యటనకు వెళ్లిన భారతీయులు బోటు ప్రమాదంలో మరణించారన్న సమాచారంపై ముఖ్యమంత్రి వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు.
ప్రమాద వివరాలను తెలుసుకోవడంతో పాటు సహాయక చర్యలను ముమ్మరం చేయడంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు వియత్నాంలోని భారతీయ ఎంబసీ కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని ఆదేశించారు.
ఈ ప్రమాదంలో తెలుగువారు ఉన్నారని ప్రాథమిక సమాచారం అందిన నేపథ్యంలో పూర్తి సమాచారం తీసుకోవాలని, ఈ ఘటనలో క్షతగాత్రులకు అవసరమైన వైద్యం అందించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు.
=========================
