ePaper
Sunday, September 6, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్తెలంగాణలో మరో పాదయాత్ర రంగంలోకి హరీష్ రావు

తెలంగాణలో మరో పాదయాత్ర రంగంలోకి హరీష్ రావు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:

తెలంగాణ  మాజీ మంత్రి హరీశ్‌రావు త్వరలో బసవేశ్వర నుంచి సంగమేశ్వర’ వరకు భారీ పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. నిలిచిపోయిన బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేయడం, రైతుల సమస్యల పరిష్కారమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిలిపివేసి రైతులకు అన్యాయం చేసిందని ఆరోపించిన ఆయన, సింగూరు నీటి వినియోగం, క్రాప్ హాలిడే పరిహారం, పంటల బీమా, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాడటమే పాదయాత్ర ఉద్దేశమని పేర్కొనగా, యాత్ర పూర్తి షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!