ePaper
Sunday, August 23, 2026
ePaper
Homeతెలంగాణపెద్దపల్లితెలంగాణ బొగ్గు బ్లాక్‌లను సింగరేణికే కేటాయించాలి 12వ వేజ్ బోర్డును వెంటనే ఏర్పాటు...

తెలంగాణ బొగ్గు బ్లాక్‌లను సింగరేణికే కేటాయించాలి 12వ వేజ్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి

📰 Generate e-Paper Clip

గోదావరిఖని,అర్జున్ సమాచారం:

తాడిచర్ల బ్లాక్-2 ను సింగరేణికి కేటాయించినందుకు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కి నాయకుల కృతజ్ఞతలు తెలిపారు.
సింగరేణి లో “భరోసా యాత్ర” పేరుతో మంగళవారం సింగరేణి ఆర్జీ వన్ ఏరియా ఓసిపి-5 కి విచ్చేసిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి  జి. కిషన్ రెడ్డి కి సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటియుసి నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ వినతి పత్రం లో తెలంగాణలో ఉన్న బొగ్గు గను లను వేలం పాట లేకుండా సింగరేణి సంస్థకే కేటాయించాలని,12వ వేజ్ బోర్డు ఒప్పంద ప్రక్రియను ప్రారంభించేందుకు తక్షణమే వేతన కమిటీని ఏర్పాటు చేయాలని, నాలుగు లేబర్ కోడ్‌ లతో  సంబంధం లేకుండా గతంలో వలే 12వ వేజ్ బోర్డు వేతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేయడం జరిగిందని నాయకులు పేర్కొన్నారు. అదేవిధంగా సింగరేణికి తాడిచర్ల బ్లాక్-2 ను కేటాయించినందుకు కేంద్ర మంత్రి కి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. వినతి పత్రం అందజేసి , కేంద్ర మంత్రి కి డిమాండ్ లను వెల్లడించిన వారిలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శిమడ్డి ఎల్లా గౌడ్, కేంద్ర కార్యదర్శి కామ్రేడ్ కవ్వంపల్లి స్వామి, బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను లు ఉన్నారు, ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి నాయకులు మాదన మహేష్, బోగ సతీష్ బాబు, ఎస్. వెంకట్ రెడ్డి, గండి ప్రసాద్, మానాల శ్రీనివాస్, కారంపూరి వెంకన్న, గుర్రం ప్రభుదాస్, చంద తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
==========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!