గోదావరిఖని ,అర్జున్ సమాచారం:
రామగుండం నియోజకవర్గాన్ని మరింత అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ గారు ఈరోజు రామగుండంలోని A-పవర్ హౌస్ సర్కిల్ వద్ద ప్రతిపాదిత ఐలాండ్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా స్థానిక పరిస్థితులను పరిశీలిస్తూ, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఐలాండ్‌ను ఆధునిక నమూనాలో అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
==========================

