హైద్రాబాద్ జులై 27,అర్జున్ సమాచారం:
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తప్పించాలని సీఎస్‌ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. సెక్రటరీ ర్యాంకుస్థానంలో ఉన్న అధికారి కోర్టు ధిక్కరణ సరికాదన్న హైకోర్టు రంగనాథ్‌పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఓ ఉన్నతాధికారి ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని పేర్కొంది. కోర్టు ధిక్కరణపై హైకోర్టుకు రంగనాథ్ క్షమాపణలు చెప్పారు.
===================

