ePaper
Friday, August 21, 2026
ePaper
Homeతెలంగాణభారీ వర్షాలకు విద్యుత్ స్తంభం విరగడంతో అప్రమత్తమైన విద్యుత్ శాఖవెంటనే మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరా...

భారీ వర్షాలకు విద్యుత్ స్తంభం విరగడంతో అప్రమత్తమైన విద్యుత్ శాఖవెంటనే మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ

📰 Generate e-Paper Clip

భారీ వర్షాలకు విద్యుత్ స్తంభం విరగడంతో అప్రమత్తమైన విద్యుత్ శాఖ
వెంటనే మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, జూలై 29

రామగిరి మండలం రాజాపూర్ గ్రామంలో కురిసిన భారీ వర్షాల కారణంగా మెయిన్ రోడ్డువద్ద ఉన్న విద్యుత్ స్తంభం విరిగి కిందపడింది. దీంతో ప్రమాద పరిస్థితి ఏర్పడగా గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే లైన్‌మన్ వడ్లకొండ రమేష్, ఏఎల్‌ఎం కందుల అంజి, ఏఎల్‌ఎం బండి శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని మరమ్మత్తు పనులు చేపట్టారు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాన్ని సరిచేసి విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా పునరుద్ధరించారు.

సమస్యపై వెంటనే స్పందించి మరమ్మతులు పూర్తి చేసిన విద్యుత్ శాఖ సిబ్బందికి గ్రామ సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి కొమరయ్య, ఉపసర్పంచ్ కలవేన శ్రీకాంత్ ముదిరాజ్, ఏఎంసీ డైరెక్టర్ పుల్లెల సతీష్, కలవేన సదానందం ముదిరాజ్, ఉగ్గే నవీన్, కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించడం అభినందనీయమని గ్రామ ప్రజలు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!