భద్రాచలం,అర్జున్ సమాచారం:
భద్రచలం పుణ్యక్షేత్రం దగ్గర గోదావరి నది నీటి మట్టం పెరుగుతోంది. 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేసారు. భద్రాచలం వద్ద దిగువకు 9లక్షల 30వేల క్యూసెక్కుల వరద నీటి విడుదల చేసారు. 48 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. గోదావరి పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఎవరూ నదీ తీర ప్రాంతాలకు వెళ్లవద్దని, అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేసారు.
==========================

