వరంగల్,అర్జున్ సమాచారం:
పోలీస్ కమిషనరేట్ లో సుధీర్ఘ కాలం విధులు నిర్వహించి పదవి విరమణ చేస్తున్న పోలీసు అధికారులు ఎస్. ఐలు అలీం హుస్సేన్, సీతారాములు, ఏఆర్ ఏ ఎస్. ఐ వెంకన్న, హెడ్ కానిస్టేబుల్ నర్సింగం లను వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్బంగా పదవీ విరమణ పొందుతున్న పోలీస్ అధికారులు వారి కుటుంబ సభ్యులను ఉద్దేశిస్తూ పోలీస్ అధికారులు తమ విధుల్లో రాణించడానికి తమ వంతు పూర్తి సహకారాన్ని అందించిన కుటుంబ సభ్యులకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రస్తుత రోజుల్లో పదవీ విరమణ చేస్తున్న పోలీస్ అధికారుల ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించడంతో నేడు ప్రశాంతమైన వాతావరణంలో విధులు నిర్వహించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తుందని. పదవి విరమణ చేసిన అధికారులు తప్పనిసరిగా ఏదో ఒక వ్యాపాకాన్ని ఎంచుకోవాలని, ఇకపై కుటుంబ సభ్యులతో సమయాన్ని వెచ్చిస్తూ, తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, అలాగే ఆరోగ్యకరమైన అలవాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆరోగ్యంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు ప్రభాకర్ రావు, సురేష్ కుమార్, శ్రీనివాస్, ఆర్ఐ సతీష్, ఆర్.ఎస్.ఐ శ్రవణ్ తో పాటు పదవీ విరమణ చేస్తున్న పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు, ఇతర పాల్గొన్నారు
========================
పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులను ఘనంగా సత్కరించిన సీపీ వరంగల్
RELATED ARTICLES

