ePaper
Saturday, August 15, 2026
ePaper
Homeతెలంగాణఅభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాల ని మంత్రి శ్రీధర్ బాబుకు వినతిసానుకూలంగా స్పందించిన మంత్రి...

అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాల ని మంత్రి శ్రీధర్ బాబుకు వినతిసానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు

📰 Generate e-Paper Clip

అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాల ని మంత్రి శ్రీధర్ బాబుకు వినతి
సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు.


అర్జున్ సమాచారం.ఆగస్టు 9 /ముత్తారం. రిపోర్టర్.


ముత్తారం మండలంలోని గ్రామాల అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ ఐటి పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు మండల సర్పంచులు వినతి పత్రం అందించారు. ఆదివారం రోజున మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు శివకుమార్ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కలిసి గ్రామాల అభివృద్ధికి సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు బియ్యాన్ని శివకుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రాథమిక వసతుల కల్పనకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరడం జరిగిందన్నారు. విద్యాభివృద్ధి, యువతకు అవసరమైన సౌకర్యాలు, గ్రామాల్లో మౌలిక వసతుల ఏర్పాటు, వివిధ అభివృద్ధి పనులు* చేపట్టేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

గ్రామాల సమగ్ర అభివృద్ధికి పంచాయతీలకు అవసరమైన సహకారం అందించాలని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సర్పంచ్‌లు కోరగా మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్తారం మండలంలోని పలువురు సర్పంచ్‌లు, పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!