ePaper
Friday, October 23, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్ఓడేడు వాగులో ప్రమాదం. సూరయ్య పల్లి పంచాయతీ కార్యదర్శి మృతి.

ఓడేడు వాగులో ప్రమాదం. సూరయ్య పల్లి పంచాయతీ కార్యదర్శి మృతి.

📰 Generate e-Paper Clip

ఓడేడు వాగులో ప్రమాదం. సూరయ్య పల్లి పంచాయతీ కార్యదర్శి మృతి.

స్నానం చేస్తుండగా నీటితో నిండిన గుంతలో పడి మృతి.భార్యను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

అర్జున్ సమాచారం // అక్టోబర్ 23 // రిపోర్టర్ మంథని,

ఓడేడు వాగులో చోటుచేసుకున్న ప్రమాదంలో శనిగరపు జయపాల్ అనే పంచాయతీ కార్యదర్శి మృతి చెందినట్లు సమాచారం. రోడ్డుపై తవ్విన గుంతలో నీరు నిల్వ ఉండగా, అందులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు పడిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది.

వివరాల ప్రకారం.. సురాయపల్లికి చెందిన పంచాయతీ కార్యదర్శి శనిగరపు జయపాల్, ఆయన భార్య కలిసి టేకుమట్లలోని అత్తగారింటికి వెళ్లి తిరిగి వస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఓడేడు వాగు వద్ద రోడ్డుపై పెద్ద గుంత తవ్వి ఉండటంతో అందులో నీరు అధికంగా నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ స్నానం చేస్తుండగా జయపాల్ ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయినట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో జయపాల్ మృతి చెందినట్లు తెలిసింది. ఆయన భార్యను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తున్నట్లు సమాచారం. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జయపాల్ రత్నపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎక్స్‌రోడ్డు వద్ద ఉన్న పెట్రోల్ బంకు ఎదురుగా నివాసం ఉంటున్నట్లు స్థానికుల ద్వారా తెలిసినధి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రమాదం జరిగిన పరిస్థితులు, అధికారిక ధ్రువీకరణ తెలియాల్సి ఉంది.

రోడ్డుపై తవ్విన గుంతల్లో నీరు నిల్వ ఉండటం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉండటంతో, ఇలాంటి ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఘటన గుర్తుచేస్తోంది. ఘటనకు సంబంధించి అధికారిక సమాచారం అందిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!