బావిలోకి దూసుకెళ్లిన కారు
సిద్దిపేట అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 20.
దుబ్బాక మండలం అప్పనపల్లిలో బుధవారం అర్ధరాత్రి కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడిపోయింది.
ఈ దారుణ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరు చిన్న పిల్లలు దుర్మరణం పాలయ్యారు.
మృతులను బలవంతపూర్ గ్రామానికి చెందిన భాగ్య, రాజు దంపతులు మరియు వారి పిల్లలు నియాన్ష్, శాన్వికగా పోలీసులు గుర్తించారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో బలవంతపూర్ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

