సమస్యలను క్షేత్ర స్థాయిలో గుర్తించి ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందంచాలి.
రోడ్డు ప్రమాదాల నివరణపై అన్ని స్థాయిల అధికారులు మరింత దృష్టి సారించాలి.
జగిత్యాల: అర్జున్ సమాచారం ప్రతినిధి అక్టోబరు 12.
దుర్గా నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా భద్రత ఏర్పాట్లు చేయాలి.
విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంశ ప్రోత్సాహకాలు…జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు కేసులను సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా సమర్ధవంతంగా పని చేయాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. ఈరోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గా ఎస్పి మాట్లాడుతూ…. పెండింగ్ కేసులపై పోలీస్ అధికారులు తీసుకొన్న ప్రత్యేక చోరవతో పెండింగ్ కేసుల్లో పురోగతి సాధించారని అన్నారు. పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. అవసమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని సూచించారు. SC/ST కేస్ లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పోక్సో యాక్ట్ కేసుల్లో విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట పోలీసు శాఖ చేపట్టిన ఫంక్షనల్ వర్టికల్స్ పటిష్ట అమలు పరుస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. దొంగతనాల నివారణకు రాత్రిపూట పెట్రోలింగ్ వ్యవస్థను, నిఘా వ్యవస్థను పటిష్ట పరచాలి అని తెలిపారు. దొంగతనాల నివారణకు ప్రతి సర్కిల్ పరిధిలో ఒక స్పెషల్ టీం ను నియమించి వాటి నివారణకు కృషి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాసిక్యూషన్ లో భాగంగా కోర్టు వారు జారిచేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను నిందితులపై లేదా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై అమలుపరచడానికి అధికారులు అందరూ కృషి చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులతో కలిసి ప్రమాదాలు ఎక్కువగా జరుగు ప్రదేశాలను గుర్తించి వాటి నివారణకు సూచి బోర్డ్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాల, రాష్ట్ర సరిహద్దుల నుండి వచ్చే గంజాయి సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి అక్రమ రవాణా పకడ్బందీగా నియంత్రించాలన్నారు. అక్రమ కార్యకలాపాలు అయిన గుట్కా, ఇసుక అక్రమ రవాణా, పేకాట,గుడుంబా, PDS రైస్, వాటి పై నిఘా ఉంచి దాడులు నిర్వహించి అరెస్ట్ చేయాలని సూచించారు. వచ్చె నెల 4 వ తేదీన ప్రారంభంకానున్న దుర్గా నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన వేడుకలను ప్రజలు శాంతియుతంగా, ప్రణాళిక ప్రకారం జరగాలని, ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఎక్కడా శాంతిభద్రతల సమస్య రానివ్వవద్దని, ఈ విషయంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు.విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంశ ప్రోత్సాహకాలు…విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన, గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరగడంలో ప్రముఖ పాత్ర వహించిన , రాజి పడదగిన కేసులలో లోక్ అదాలత్ లో పరిష్కరించేందుకు కృషి చేసిన పోలీస్ అధికారులను మరి సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.

