రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో జగిత్యాల వాసి మృతి.
జగిత్యాల జిల్లా ప్రతినిధి .అర్జున్ సమాచారం సెప్టెంబర్ 2::
కుటుంబాన్ని పోషించేందుకు నాలుగు నెలల క్రితం ఉక్రెయిన్‌కు వెళ్లిన జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్‌కు చెందిన వావిలాల సుదర్శన్ (42) రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మిస్సైల్ దాడిలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. నిర్మాణ రంగంలో పనిచేస్తున్న సుదర్శన్ సోమవారం రాత్రి రష్యా నుంచి బయటకు వస్తుండగా మిస్సైల్ తాకినట్లు తెలిపారు. ఆయన మృతితో భార్య భార్గవి, ఇద్దరు కుమారులు కన్నీరుమున్నీరవుతున్నారు.

