కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష.. మళ్లీ కేసీఆర్ నాయకత్వం కావాలంటున్న ప్రజలు!
బీఆర్ఎస్‌లో చేరిన ఇంద్రవెల్లి మండలం అంజి గ్రామస్థులు.
గులాబీ ఖండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ గారు
జన్నారం ప్రతినిధి : అర్జున్ సమాచారం అక్టోబర్13:
ఖానాపూర్ నియోజకవర్గంలోని ఇంద్రవెల్లి మండలం అంజి గ్రామస్తులు, యువకులు, మహిళలు ఈరోజు బీ ఆర్ ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా భూక్యా జాన్సన్ నాయక్ గారు మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, ముఖ్యంగా గ్రామాల రూపురేఖలు మారిపోయాయని అన్నారు.
సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పనిచేసే పార్టీగా బీఆర్ఎస్‌పై ప్రజల్లో విశ్వాసం కొనసాగుతోందని, అందుకే ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు.
అంజి గ్రామ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం, గుర్తింపు కల్పిస్తామని, పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలు పేరుకుపోతున్నా వాటిని పట్టించుకునే నాథుడే లేడని విమర్శించారు. కేసీఆర్ గారి పాలనలో గ్రామాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగాయని, ప్రస్తుతం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గ్రామీణాభివృద్ధి కుంటుపడుతోందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ ప్రజలకు అండగా నిలిచే పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

