అర్హులైన ప్రతి ఒక్కరికీ డిజిటల్ రేషన్ కార్డులు అందించడమే ప్రభుత్వ లక్ష్యం,
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్.
మంచిర్యాల, అక్టోబర్ 28: అర్జున్ సమాచారం ప్రతినిధి.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4, 5, 6, 7, 2, 27, 28, 26వ డివిజన్లలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలంటే తెల్ల రేషన్ కార్డు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం ద్వారా ప్రజలకు మరింత పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని మేయర్ వెల్లడించారు. ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు వేల్పుల రవీందర్, కొండ్ర రాజేశ్వరి లింగయ్య, అమృత్ రాజ్ కుమార్, గుమ్మడి శ్రీనివాస్, తోటపల్లి రాజేశ్వరి, వనపర్తి కేత రాజేష్, ఇరగదిండ్ల రవి, కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిలు అంగిడి రాజేష్, బత్తుల స్వామి, మారు మల్లయ్య, కొత్త రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

