ePaper
Monday, September 21, 2026
ePaper
Homeతెలంగాణతిలక్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల నిర్వహణ అభినందనీయం….రూరల్ సీఐ హనుక్…

తిలక్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల నిర్వహణ అభినందనీయం….రూరల్ సీఐ హనుక్…

📰 Generate e-Paper Clip

తిలక్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల నిర్వహణ అభినందనీయం….
రూరల్ సీఐ హనుక్…
అర్జున్ సమాచారం సెప్టెంబర్ 20 బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి

బెల్లంపల్లి పట్టణంలో ఆదివారం ఉదయం తిలక్ గ్రౌండ్ లో తిలక్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలను రూరల్ సీఐ హనుక్, విశ్రాంత అదనపు ఎస్పీ పుల్లాల రవికుమార్, 1టౌన్ ఎస్సై రామకృష్ణ లు, జెండా ఊపి ,ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 50 సంవత్సరాలు దాటిన వారు యువకుల వలె అన్ని ఆటల పోటిల్లో పాల్గొనడం అభినందనీయం అని అన్నారు.క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని, ప్రతి రోజు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని అన్నారు.స్పీడు వాక్, రన్నింగ్, షాట్ పుట్, టాగ్ అఫ్ వార్, తదితర పోటీలు నిర్వహించారు.అనంతరం బహుమతులు ను అందచేశారు. సీనియర్ క్రీడా కారులు యాదండ్ల నర్సయ్య, తోట పోచన్న, మాదాసి గోపాల్, గోవర్ధన్ లను ఘనంగా సన్మానించారు. ఆటల పోటీలకు క్రీడల పిడిలు రాజ్ మహమ్మద్, బండి రవి, చంద్ పాషా, లు సహకారం అందించారు. వారిని ఘనంగా సన్మానించి,ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమం లో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రంగ రామన్న, ప్రధాన కార్యదర్శి కంటే వాడ నగేష్, కోశాధికారి కజ్జం రమేష్, సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!