ePaper
Saturday, November 7, 2026
ePaper
Homeజాతియంఢిల్లీఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ఇద్దరు పిల్లల నిబంధనపై...

ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ఇద్దరు పిల్లల నిబంధనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు సంతానోత్పత్తి రేటు 2.1 కంటే దిగువకు తగ్గినట్లు గుర్తుచేసిన కోర్టు వృద్ధుల జనాభా పెరుగుదలపై కోర్టు ఆందోళన మూడో సంతానంతో అనర్హతకు గురైన మాజీ సర్పంచ్‌కు ఊరట

📰 Generate e-Paper Clip

న్యూఢిల్లీ,అర్జున్ సమాచారం:
ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలకు మించి ఉండకూడదనే నిబంధన ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతవరకు సమంజసమని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశంలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ఇద్దరికి మించి పిల్లలున్నవారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించే చట్టాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. గత రెండు దశాబ్దాల్లో దేశ జనాభా పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని బుధవారం విచారణ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుతం భారతదేశ మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎఫ్‌ఆర్‌) 2.1 అనే ప్రత్యామ్నాయ స్థాయి కంటే దిగువకు పడిపోయిందని గుర్తుచేసింది. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే దశాబ్దాల్లో వృద్ధుల జనాభా పెరిగే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇద్దరికి మించి పిల్లలున్నవారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడం ఇప్పటికీ అవసరమా? అని ప్రశ్నించింది. మహారాష్ట్రలోని కాకోడా గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్‌ మంగళ భీమ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. మూడో సంతానం జన్మించడంతో ఆమెను ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హురాలిగా ప్రకటించారు. ఆమె అప్పీల్‌ను అనుమతించిన సుప్రీంకోర్టు, అనర్హత నిర్ణయాన్ని రద్దు చేసింది. ఇదే అంశంపై 2003లో వెలువడిన జావేద్‌ వర్సెస్‌ హర్యానా రాష్ట్రం తీర్పును కూడా సుప్రీంకోర్టు పునఃపరిశీలనకు స్వీకరించింది. ఆ తీర్పును విస్తృత ధర్మాసనానికి నివేదించింది. హర్యానా పంచాయతీరాజ్‌ చట్టం-1994 ప్రకారం ఇద్దరికి మించి పిల్లలున్నవారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని అప్పట్లో ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం సమర్థించింది. 2003లో ఆ తీర్పు వెలువడినప్పుడు దేశంలో ఒక్కో మహిళకు సగటున ముగ్గురు పిల్లలు ఉండేవారని, జనాభా నియంత్రణ ప్రధాన విధానపరమైన అంశంగా ఉండేదని ప్రస్తుత ధర్మాసనం గుర్తుచేసింది. ఇప్పుడు పరిస్థితులు మారినందున ఈ నిబంధనలు రాజ్యాంగబద్ధంగా కొనసాగాలా? లేదా? అన్నది విస్తృత ధర్మాసనం తేల్చనుంది. అయితే, ఇద్దరు పిల్లల నిబంధనను దేశవ్యాప్తంగా రద్దు చేసినట్లు సుప్రీంకోర్టు ప్రకటించలేదు.
=======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!