సంగారెడ్డి,అర్జున్ సమాచారం:
పటాన్ చెరు నియోజకవర్గం అమీన్ పూర్ లోని టీజీ ఎస్ పిఎఫ్ సెక్యూరిటీ అకాడమీ ఆధ్వర్యంలో 36 వ రైజింగ్ డే పేరెడ్ లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గోన్నారు
36 వ బ్యాచ్ టీజీ ఎస్ పిఎఫ్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి డీజీ స్వాతి లక్రా, పోలీస్ ఉన్నతాధికారులు హజరయ్యారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ విధి నిర్వహణలో తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సేవలు మరువలేనివి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 67 సంస్థలకు 2 వేల మందికి పైగా ఎస్ పి ఎస్ సిబ్బంది సేవలందిస్తున్నారని అన్నారు.
పటిష్టమైన రక్షణ, భద్రతే అభివృద్ధికి పునాది. అలాంటి బాధ్యతలు స్వీకరించి పనిచేస్తున్న ఎస్ పి ఎఫ్ సేవలు భేష్. 35 ఏళ్లలో భద్రతా రంగంలో ఎంతో మార్పులు వచ్చాయి. కృత్రిమ మేధ, టెక్నాలజీ వంటివి ఉపయోగించి భద్రతా వ్యవస్థ మరింత బలోపేతం చేశాం. ఎస్ పి ఎఫ్ ప్రజలతో మమేకమై, ప్రజలలో భయాన్ని కాకుండా భరోసా కల్పించాలి . దేశానికి, రాష్ట్రానికి భద్రత కల్పిస్తున్న ఎస్ పిఎఫ్ దళాలకు వారి కుటుంబ సభ్యుల మనోధైర్యం మరువలేం. జాతిగర్వపడే విధంగా ఆయుధాలతోనే కాకుండా ఆలోచనాత్మక థోరణితో ప్రగతి పథంలో రాష్ట్రం ముందుకు సాగాలని అన్నారు.

