ePaper
Thursday, November 5, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన బజార్ హత్నూర్ ఎస్ఐ

ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన బజార్ హత్నూర్ ఎస్ఐ

📰 Generate e-Paper Clip

ఆదిలాబాద్,అర్జున్ సమాచారం:
ఆదిలాబాద్ జిల్లాలో అవినీతి పోలీస్ అధికారి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.  కేసు వ్యవహారంలో 50 వేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. చివరకు 40 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వల పన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
బజార్ హత్నూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రమేష్ అవినీతి బాగోతం వెలుగుచూసింది. ఓ కేసు విషయమై 50 వేల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే అంత ఇచ్చుకోలేనని బాధితుడు బతిమాలడంతో.. చివరకు 40 వేల రూపాయలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఎస్ఐ వేధింపులు భరించలేని బాధితుడు నేరుగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ గొర్రె మధు.. పక్కా ప్రణాళికతో వల పన్నారు. డీఎస్పీ మధు ఆధ్వర్యంలో అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించి.. బాధితుడి నుంచి ఎస్ఐ రమేష్ 40 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
=================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!