ePaper
Monday, November 16, 2026
ePaper
Homeతెలంగాణకరీంనగర్కరీంనగర్ సీపీ వివాదం పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

కరీంనగర్ సీపీ వివాదం పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

📰 Generate e-Paper Clip

కరీంనగర్ : అర్జున్ సమాచారం:
కరీంనగర్ పోలీస్ కమిషనర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తన గొంతు నమూనాలు (వాయిస్ శాంపిల్స్) ఇవ్వాలని పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో ఆయన పోలీసు దర్యాప్తునకు సహకరించి వాయిస్ శాంపిల్స్ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది.
కేసు నేపథ్యం: ఈ ఏడాది జనవరి 29న జరిగిన మినీ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా అప్పటి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై కరీంనగర్ జిల్లా వీణవంక పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఘటన నాటి ఆడియో, వీడియో రికార్డులను పరిశీలించిన పోలీసులు.. వాటిని సరిపోల్చేందుకు కౌశిక్ రెడ్డి గొంతు నమూనాలను సేకరించాలని నిర్ణయించారు.
కోర్టులో వాదనలు: వాయిస్ శాంపిల్స్ సేకరణకు సంబంధించి మేజిస్ట్రేట్ కోర్టు అనుమతి ఇవ్వడంతో దర్యాప్తు అధికారులు కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయితే, కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను, పోలీసు నోటీసులను రద్దు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేశారు. పోలీసుల చర్య చట్టవిరుద్ధమని, తన హక్కులను కాలరాయడమేనని కౌశిక్ రెడ్డి తరఫు న్యాయవాదులు వాదించారు. మరోవైపు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నేర విచారణలో భాగంగా ఆధారాలను శాస్త్రీయంగా ధ్రువీకరించేందుకు నిందితుల వాయిస్ శాంపిల్స్ సేకరించడం సాధారణ ప్రక్రియేనని స్పష్టం చేశారు. ఇరుపక్షాల వాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన హైకోర్టు.. దర్యాప్తు ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ కౌశిక్ రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసింది.
===========

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!