ePaper
Monday, November 16, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్భారత్ సమ్మిట్ వివాదం.. డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసిన బీజేపీ నేతలు

భారత్ సమ్మిట్ వివాదం.. డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసిన బీజేపీ నేతలు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, నవంబరు 16,అర్జున్ సమాచారం:
తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను బీజేపీ నేతలు సోమవారం కలిశారు. డీజీపీని కలిసి భారత్ సమ్మిట్‌లో దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడారు. భారత్ సమ్మిట్‌లో విదేశీయులు భారత రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ నిర్వహించింది భారత్ సమ్మిట్ కాదని.. యాంటీ భారత్ సమ్మిట్ సంచలన ఆరోపణలు చేశారు. Foreigners Act కింద ఈ కేసులు నమోదు చేయాలని డీజీపీని కోరారు.
న్యాయపోరాటం చేస్తాం..: సమ్మతి భారత్ ఫౌండేషన్, ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ సదస్సు నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వ పాత్రపై కూడా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ ప్రధాన ప్రేరకుడని అన్నారు. విదేశీయుల పర్యటన ఉద్దేశంపై అనుమానాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. భారత్‌ వ్యతిరేక కార్యకలాపాల సమాచారం చివరి నిమిషంలో కేంద్ర ప్రభుత్వానికి తెలిసిందని అన్నారు. ఈ క్రమంలోనే 115 మందికి విమాన ప్రయాణాలను రద్దు చేశారని తెలిపారు. వారిపై చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.
భారతదేశంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు..: భారతదేశం గడ్డమీద మనల్ని ప్రపంచం ముందు అవమానించడానికి ప్రయత్నించారని.. ఇది చాలా అభ్యంతకరమని బీజేపీ నేతలు ధ్వజమెత్తారు. సెక్షన్ 22 కింద వారిపై కేసు పెట్టాలని డీజీపీని కోరారు. సమృద్ధి ఫారెన్ ఫౌండేషన్‌పై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. నేరం చేయడానికి విదేశీ నేతలను ప్రోత్సహించారని, అలాంటి ఆర్గనైజర్స్‌పై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయ సలహాలు తీసుకొని వారిపై చర్యలు తీసుకుంటామని డీజీపీ చెప్పారని అన్నారు. ఇటలీలో ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాలుగు పార్టీల వ్యక్తులు భారతదేశంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. డీజీపీ నిర్ణయం తర్వాత బీజేపీ తదుపరి ప్రణాళికలు ప్రకటిస్తామని స్పష్టం చేశారు. సదస్సు పేరుతో దేశంలోకి విదేశీ నేతలను తీసుకువచ్చి ఇలా ఎందుకు మాట్లాడించారని బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!