హైదరాబాద్:-అర్జున్ సమాచారం:
సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన చోటుచేసుకుంది. మెట్రో పిల్లర్ నంబర్ 1644 వద్ద ఎల్బీనగర్–దిల్సుఖ్నగర్ ప్రధాన రహదారిపై ప్రయాణిస్తున్న AP09CP 6421 నంబర్ గల VOLKSWAGEN POLO కారులోని ఇంజన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద సమయంలో కారులో ఒక్కరే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కారులో మంటలు…డ్రైవర్ సురక్షితం
RELATED ARTICLES

