హైదరాబాద్,అర్జున్ సమాచారం:
షెడ్యూల్ వచ్చిన తర్వాత రాజకీయం గురించి మాట్లాడుతా. నేను ప్రజలకు అందుబాటులో ఉంటా… ప్రజలు నన్ను ఆదరిస్తారు. ప్రజల ఆశిస్సులు నాకు ఉంటాయి. నా అనుచరులు అంతా పోటీ చేయడానికి మద్దతు ఇచ్చారని దానం నాగేందర్ అన్నారు.
ప్రజల మధ్య ఉండే నేతకు ఏ పార్టీ లొ ఉన్నా మద్దతు ఉంటుంది. కాంగ్రెస్ అన్ని పథకాలు అమలు చేస్తుంది . రోజు కు సీఎం 18 గంటలు పనిచేస్తున్నారు. సంక్షేమ పథకాలు కాంగ్రెస్ లాభం చేస్తాయి. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత నేను ఇంతవరకు సీఎం ను కలవలేదని అన్నారు.
ఉప ఎన్నిక వచ్చినప్పుడు నిధులు ఎక్కువ వస్తాయి… నా నియిజకవర్గం ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఎవరు ఎన్ని మాట్లాడినా ఎన్నికల్లో రిజల్ట్స్ చూపిస్తా. 2004 లొ నా ఓటమి కి కర్ణుడు చావు కు ఎన్ని కారణాలు ఉన్నాయో అన్ని ఉన్నాయి. ఆ తర్వాత నాకు ప్రమోషన్ వచ్చి మంత్రి అయ్యా.. ఇప్పుడు కూడా టీం తొ పనిచేస్తాం… గెలుస్తాం. పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి కి చమటలు పట్టించా. నాకు టైం సరిపోక ఎంపీ గా ఓడిపోయా.. గెలిచి ఉంటె ఉప ఎన్నిక చర్చే లేదు. ఎంపీ గా గెలిచి ఉంటె… నా ఇంట్లో నుంచి మరొకరిని ఎమ్మెల్యే గా నిలబెట్టే వాడిని. బిఆర్ఎస్ చిన్న విషయాన్ని పెద్దదిగా చూపిస్తున్నారు. నా నియోజకవర్గాన్ని ఇప్పటికే చాలా అభివృద్ధి చేసా.. నా సెగ్మెంట్ లొ 10 వేల ఇల్లు కట్టే స్థలం ఉంది… వీటంన్నింటి కోసం ప్రయత్నం చేస్తానని అన్నారు.

