మేడ్చల్,అర్జున్ సమాచారం:
పోలీసు ఉన్నతాధికారులు కీసర పోలీస్‌స్టేషన్‌లో శాఖాపరంగా భారీ మార్పులు చేపట్టారు. ఎస్‌ఐ నాగరాజుతో పాటు మరో పదిమంది కానిస్టేబుళ్లను సౌత్‌జోన్‌కు బదిలీ చేస్తూ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. నెల రోజుల క్రితం కీసర పోలీస్‌స్టేషన్‌లో సీఐ, ఎస్‌ఐలు ఏసీబీకి లంచం తీసుకుంటూ పట్టుబడగా.. నాలుగు రోజుల క్రితం ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి కూడా పట్టుబడిన విషయం తెలిసిందే. ఒకే పోలీస్‌స్టేషన్‌లో వరుసగా అవినీతి ఆరోపణలు, ఏసీబీ కేసులు వెలుగులోకి రావడంతో ఈ బదిలీలు జరిగినట్లుసమాచారం. కొత్త ఎస్‌ఐలుగా కీసర కు వెంకట్‌రెడ్డి, నాగారం కు గౌరేందర్‌గౌడ్, చీర్యాల్ కు ప్రభాకర్‌లను నియమించారు.
====================
కీసర పోలీస్‌స్టేషన్‌లో భారీ ప్రక్షాళన పదకొండు మంది సిబ్బంది బదిలీ
RELATED ARTICLES

