ePaper
Sunday, November 1, 2026
ePaper
Homeతెలంగాణనల్గోండ‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి ’ – కోర్టు డ్యూటీ అధికారుల...

‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి ’ – కోర్టు డ్యూటీ అధికారుల సమీక్ష సమావేశంలో ఎస్పీ శరత్ చంద్ర

📰 Generate e-Paper Clip

న‌ల్ల‌గొండ‌, అక్టోబర్ 31, అర్జున్ సమాచారం:
కోర్టుల్లో కేసుల విచారణలో దోషుల‌కు శిక్షలు పడే కన్విక్షన్ శాతాన్ని మరింత పెంచే దిశగా కోర్టు డ్యూటీ అధికారులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పని చేయాలని న‌ల్ల‌గొండ‌ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్టు డ్యూటీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసుల విచారణలో ఎలాంటి లోపాలకు తావులేకుండా ప్రతి కేసులో నేర నిరూపణ జరిగేలా సంబంధిత అధికారుల మధ్య సమన్వయం ఉండాలన్నారు. ప్రతి కేసులో దర్యాప్తు సమయంలో సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, వైద్య నివేదికలు, ఇతర కీలక పత్రాలను కోర్టులో సమర్పించే విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా దర్యాప్తు అధికారులతో కోర్టు డ్యూటీ అధికారులు నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. కేసుల విచారణలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, పోక్సో కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ కేసుల విచారణలో సాక్షుల హాజరు, సాక్ష్యాధారాల సమర్పణ. కోర్టు ప్రక్రియలను నిరంతరం పర్యవేక్షించాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమన్వయం చేసుకుంటూ నిండితులకు చట్టప్రకారం శిక్షలు పడేలా కృషి చేయాలని తెలిపారు. కేసుల్లో కన్విక్షన్ శాతం పెంపునకు ప్రతి కోర్టు డ్యూటీ అధికారి తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, కేసుల విచారణలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో చొరవ చూపాలన్నారు. కోర్టుల్లో నిందితులకు శిక్షలు పడేలా సమర్థవంతమైన సమన్వయం చేసి, కన్విక్షన్ శాతం పెంపులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను ఆయన అభినందించారు. భవిష్యత్‌లో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేశ్‌, సీఐలు శ్రీను నాయక్, బీషన్న, సంబంధిత పోలీస్ అధికారులు, కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.
ఘనంగా సర్దార్ పటేల్ జయంతి వేడుకలు: స్వాతంత్య్ర సమరయోధుడు, భారత తొలి ఉప ప్రధానమంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని శనివారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ ఐక్యత దినోత్సవంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఓ శివప్రసాద్, ఎస్బీ డిఎస్పీ మల్లారెడ్డి, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసులు, సీఐలు, ఆర్.ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!