ePaper
Wednesday, August 26, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్గంటల్లోనే ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ కేసు ఛేదింపు హైదరాబాద్

గంటల్లోనే ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ కేసు ఛేదింపు హైదరాబాద్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
గచ్చిబౌలిలో ఇద్దరు చిన్నారుల కిడ్నప్ కేసు చేధించాం.   వెస్ట్ బెంగాల్ చెందిన కిడ్నాపర్ చాకు సోరెన్ అరెస్ట్ చేసామని శేలిలింగంపల్లి జోన్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు.
కేసు వివరాలు అయన మీడియాకు వెల్లడించారు.  గచ్చిబౌలిలోని  సుదర్శన్ నగర్ వద్ద ఓ కన్స్ట్రక్షన్ లేబర్ క్యాంప్ లో  నిన్న సాయంత్రం 4 గంటలకు చిన్నారులకు చాక్లెట్స్ ఇప్పిస్తానని తీసుకెళ్లి కిడ్నాప్ చేసాడు.  నాలుగు  ప్రత్యేక పోలీస్ బృందాలతో గాలింపు చేపట్టాము. కిడ్నాప్ గురైన బాలికలు ఇద్దరు 4 ఏళ్ల లోపు వయస్సు వుంది. నిన్న రాత్రి నుండి అన్ని చెక్ పోస్ట్ రైల్వే స్టేషన్ అలెర్ట్ చేసాం. ఘాట్ కేసర్ పెట్రో కారు సమాచారం ఇచ్చాం.  ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో చిన్నారులతో కలిసి వెళుతుండగా కిడ్నాపర్ ను పట్టుకున్నామని అన్నారు.
నిన్న మిడ్ నైట్ మాకు ఫిర్యాదు అందగానే 4 పోలీస్ టీమ్స్ ఫామ్ చేశాము. గంటల వ్యవధిలోనే కిడ్నప్ కేసు ను చెందించం. ఇద్దరు చిన్నారులు సురక్షితం ఉన్నారు. కిడ్నాపర్ చాకు సోరెన్ ఇతనికి నేర చరిత్ర ఉంది. గతంలో అటెంప్ట్ మర్డర్ కేసుతోపాటు రేప్ కేసులో ఇతను అరెస్ట్ అయ్యాడు. ఇతను పై వెస్ట్ బెంగాల్లో రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి . లేబర్ క్యాంప్ లో పనిచేసే వ్యక్తే చిన్నారుల కిడ్నప్ చేసినట్లు  నిర్ధారణ అయింది. నిన్న సాయంత్రం ఇద్దరూ బాలికలను చాక్లెట్ ఇప్పిస్తానని కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేసిన వ్యక్తి ఈ క్యాంపులోనే సెంట్రింగ్ పని చేస్తాడు. చిన్నారుల తల్లిదండ్రులు బిజీగా ఉన్న సమయంలో కిడ్నాప్ చేశాడు. విచారణలో, పశ్చిమ బెంగాల్లోని కరండిఘి పోలీస్ స్టేషన్లో నమోదైన రెండు క్రిమినల్ కేసులలో ఇతని ప్రమేయం ఉంది. ఒకటి హత్యాయత్నానికి సంబంధించినది కాగా, మరొకటి అత్యాచారానికి సంబంధించినది. పశ్చిమ బెంగాల్లోని ఇస్లాంపూర్ జైలులో ఐదు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. డబ్బు సంపాదించడం కోసం చిన్నారులను కిడ్నాప్ చేసాడు. పిల్లలు అవసరం ఉన్నవారికి అమ్మడంలో ఇతని ప్రమేయం ఉంది. చిన్నారులను భిక్షాటన కోసం ఉపయోగించు కోవాలని నిందితుడు కిడ్నాప్ చేసాడు. ఇతర క్రిమినల్ కార్యకలాపాల గురించి క్షుణ్ణంగా విచారిస్తున్నారు.  గతంలో ఏవైనా క్రిమినల్ కేసులలో అతని ప్రమేయం నిర్ధారించుకోవడానికి అతని పూర్వ చరిత్రను విచారణ జరుపుతున్నామని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!