ePaper
Wednesday, August 26, 2026
ePaper
Homeసినిమా"ఫాదర్" సినిమా టీజర్ రిలీజ్

“ఫాదర్” సినిమా టీజర్ రిలీజ్

📰 Generate e-Paper Clip

డార్లింగ్ కృష్ణ, ప్రకాష్ రాజ్, అమృత అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “ఫాదర్”. ఈ చిత్రాన్ని ఆర్ సి స్టూడియోస్  బ్యానర్ పై ఆర్ చంద్రు, యమున చంద్రశేఖర్, ఆనంద్ పండిట్ నిర్మిస్తున్నారు. రాజమోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫాదర్, సన్ బాండింగ్ నేపథ్యంగా సాగే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా కథతో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో గ్రాండ్ పాన్ ఇండియా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “ఫాదర్” సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
“ఫాదర్” సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే – తండ్రి( ప్రకాష్ రాజ్ )ని దేవుడిలా కొలిచే కొడుకు కృష్ణ (డార్లింగ్ కృష్ణ). మళ్లీ జన్మంటూ ఉంటే కృష్ణకు తండ్రిగా పుట్టాలని కోరుకునేంత ప్రేమను గుండెల నిండా నింపుకుంటాడు తండ్రి. అంతగా ప్రేమించిన కొడుకును వదిలి తండ్రి దూరంగా వెళ్లిపోవాలనుకుంటాడు. ఈ ఎడబాటుకు కారణం ఏంటి, కొడుకును వదిలి తండ్రి ఎందుకు దూరంగా వెళ్లిపోవాలని అనుకున్నాడు వంటి అంశాలతో “ఫాదర్” సినిమా టీజర్ ఆసక్తికరంగా సాగింది. గగనపు సూర్యుడే, వెలుగుల చంద్రుడే, ధరణికి దేవుడే నాన్నా…అంటూ వచ్చిన బీజీఎం సాంగ్ హార్ట్ టచింగ్ గా ఉంది. ఫాదర్, సన్ రిలేషన్ నేపథ్యంగా ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ ఫ్యామిలీ మూవీ చూడబోతున్నామనే ఇంప్రెషన్ ను ఈ టీజర్ కలిగిస్తోంది.
నటీనటులు – డార్లింగ్ కృష్ణ, ప్రకాష్ రాజ్, అమృత అయ్యంగార్, నాగభూషణ ఎన్ ఎస్, రమేష్ ఇందిర, అవినాష్, హొన్నవల్లి కృష్ణ, గగన్ బిఎ, తదితరులు
============================

Previous article
22A భూముల వ్యవహారంలో ఏ-1 రేవంత్ రెడ్డి, ఏ-2 పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కమీషన్ల కోసమే సామాన్యుల ఆస్తులు నిషేధిత జాబితాలోకి. తప్పు చేసింది ప్రభుత్వం.. దరఖాస్తుల పేరుతో కార్యాలయాల చుట్టూ జనం ఎందుకు తిరగాలి? సీఎం తమ్ముడికి కోట్ల విలువైన భూములు.. ప్రజల ఆస్తులేమో నిషేధిత జాబితాలో పెడతారా? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు.. ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కరువైంది . 22 ఏ నిషేధిత జాబితా అక్రమాలపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, శ్వేతపత్రం విడుదల చేయాలి. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలి. బాధితుల పక్షాన సెప్టెంబర్ 7న అసెంబ్లీ దద్దరిల్లేలా ప్రభుత్వాన్ని నిలదీస్తాం.
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!