అర్జున్ సమాచారం: గచ్చిబౌలి – కొండాపూర్ ప్రధాన రహదారిపై హైడ్రా, సిఎంసి అధికారులు సంయుక్తంగా భారీ ఎత్తున ఆక్రమణల తొలగింపు చేపట్టారు. కొండాపూర్ బొటానికల్ గార్డెన్ నుంచి మసీద్‌బండ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మాణాలు, షెడ్లు, ఇతర ఆక్రమణలను తెల్లవారుజామున 4 గంటల నుంచే తొలగిస్తున్నారు.
ఆక్రమణల తొలగింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జేసీబీలు, ఇతర యంత్రాలతో అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు.
ఈ చర్యలతో గచ్చిబౌలి – కొండాపూర్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని పోలీసులు సూచిస్తున్నారు
