ePaper
Monday, July 6, 2026
ePaper
Homeతెలంగాణసిద్ధిపేటసిద్దిపేట కు రేవంత్ రెడ్డి గ్రహణం పట్టింది: మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

సిద్దిపేట కు రేవంత్ రెడ్డి గ్రహణం పట్టింది: మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

📰 Generate e-Paper Clip

సిద్దిపేట,అర్జున్ సమాచారం:

హరీష్ రావు మాట్లాడుతూ వచ్చేది మన ప్రభుత్వమే సిద్దిపేట అభివృద్ధి వంద కిలోమీటర్ల వేగం తో ప్రగతి పరుగులు పెట్టిస్తా
మీ అందరి తలరాత మారాలి అంటే కెసిఆర్ అనే గీత పెట్టుకోవాలి. అ గీత నే మీ భవిష్యత్ మారుస్తుంది
సిద్దిపేట లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతు.
రియల్ ఎస్టేట్ ఒక పెద్ద వ్యాపారం. రియల్ ఎస్టేట్ బాగుంటే దానికి అనుబంధంగా ఎన్నో రంగాలు బాగుంటాయి
రియల్ ఎస్టేట్ రంగం బాగా నడిస్తే ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుగుతుందని, అలాగే సిమెంట్, స్టీల్, టైల్స్, శానిటరీ, మార్బుల్స్ వంటి అనేక రంగాలకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. వందలాది వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోయింది. మీరందరూ ఇంతకుముందు ఎంత ఉత్సాహంగా ఉండేవారు!
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయిందని, దాని ప్రభావంతో చిన్న వ్యాపారాలు,టీ హోటళ్లు, దుకాణాలు,ఇతర అనుబంధ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని
ఇది ఒక్క సిద్దిపేట పరిస్థితి కాదు. రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి. హైదరాబాద్‌లో చూసినా ఇదే, కరీంనగర్‌లో చూసినా ఇదే,నల్గొండలో చూసినా ఇదే, మహబూబ్‌నగర్‌లో చూసినా ఇదే, నిజామాబాద్‌లో చూసినా ఇదే పరిస్థితి.
ఎక్కడ చూసినా వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దుకాణాలు నడవడం లేదు. షాపులకు గిరాకీ లేదు. వ్యాపారం పూర్తిగా దెబ్బతింది.
రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆర్థిక ఇబ్బందులతో వాహనాల ఈఎంఐలు కూడా చెల్లించలేక, ఫైనాన్స్ సంస్థలు వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు.
కుటుంబాలు పిల్లల ఫీజులు చెల్లించలేక, కొందరు పట్టణాలు వదిలి గ్రామాలకు వెళ్లి వ్యవసాయం చేసుకునే పరిస్థితి వచ్చింది
అంటే జీవితమే రివర్స్ అయిపోయింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!