ePaper
Sunday, November 8, 2026
ePaper
Homeసినిమాజనవరి 12 విడుదల’ సినిమా కజకిస్థాన్‌ షెడ్యూల్‌ ప్రారంభం

జనవరి 12 విడుదల’ సినిమా కజకిస్థాన్‌ షెడ్యూల్‌ ప్రారంభం

📰 Generate e-Paper Clip

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో హిట్ మిషన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’ శరవేగంగా షూటింగ్
జరుపుకుంటోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా
నటిస్తున్నారు. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్, హ్యూమర్, కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కంప్లీట్ ప్యాకేజీగా
అలరించనుంది. తాజాగా చిత్ర బృందం కజకిస్థాన్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది.
ఈ షెడ్యూల్ కోసం దర్శకుడు అనిల్ రావిపూడి యాక్షన్, పాటల కలయికతో ప్రత్యేకమైన ప్లాన్ సిద్ధం చేశారు. ఇందులో హీరోలిద్దరితో రెండు ప్రధాన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ప్రముఖ స్టంట్
కొరియోగ్రాఫర్ రియల్ సతీష్ పర్యవేక్షణలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఈ రోజు ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో పాల్గొన్నారు. కజకిస్థాన్‌లోని అద్భుతమైన ప్రకృతి దృశ్యాల నేపథ్యంలో ఈ యాక్షన్
ఎపిసోడ్‌ను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే యాక్షన్ బ్లాక్‌లో కనిపిస్తుండటంతో పాటు, అనిల్ రావిపూడి స్వయంగా ఈ సీక్వెన్స్‌ను పర్యవేక్షిస్తుండటంతో ఇది సినిమాలో ప్రధాన
హైలైట్స్‌లో ఒకటిగా నిలవనుంది.
ఈ కజకిస్థాన్ షెడ్యూల్‌లో వెంకటేష్, కళ్యాణ్ రామ్ కలిసి నటించే మరో గ్రాండ్ సాంగ్‌ను కూడా చిత్రీకరించనున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్న ఈ ప్రత్యేక పాటను అందమైన లొకేషన్లలో
తెరకెక్కించనున్నారు. ఇద్దరు హీరోల ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్, అద్భుతమైన విజువల్స్‌తో ఈ పాట ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. భారీ యాక్షన్ సీక్వెన్స్, గ్రాండ్ సాంగ్.. వీటికి తోడు అందమైన
కజకిస్థాన్ లొకేషన్లలో వెంకటేష్, కళ్యాణ్ రామ్‌ల సందడి ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్‌గా నిలవనుంది.
తాజాగా విడుదల చేసిన వర్కింగ్ స్టిల్‌లో కజకిస్థాన్‌లోని అందమైన పర్వత ప్రాంతాల నేపథ్యంలో వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, దర్శకుడు అనిల్ రావిపూడి ఉత్సాహంగా కనిపిస్తున్నారు. కళ్యాణ్ రామ్గ్రే కలర్ క్యాజువల్ టీషర్ట్, బ్రౌన్ బాంబర్ జాకెట్, క్యామఫ్లాజ్ కార్గో ప్యాంట్, బ్లాక్ షూస్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. వెంకటేష్ డార్క్ టీషర్ట్‌పై ఆలివ్ గ్రీన్ జాకెట్, క్యామఫ్లాజ్ కార్గో ప్యాంట్, గ్రే స్నీకర్స్‌తో రగ్గడ్లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. ఇద్దరూ సన్‌గ్లాసెస్‌తో కూల్ అండ్ అడ్వెంచరస్ లుక్‌ తో ఆకట్టుకున్నారు.
అనిల్ రావిపూడి తనదైన ఎంటర్‌టైన్‌మెంట్‌కు యాక్షన్, డ్యాన్స్‌ను జోడిస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కజకిస్థాన్ షెడ్యూల్‌తో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని
అందించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది.
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పనిచేస్తోంది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా
వ్యవహరిస్తున్నారు. ఎస్ కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన హీరోల ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రం జనవరి 12న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సంక్రాంతికి ప్రత్యేక ఆకర్షణగా ‘జనవరి 12 విడుదల’
ప్రేక్షకుల ముందుకు రానుంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!