ePaper
Sunday, November 8, 2026
ePaper
HomeసినిమాG.O.A.T (గోట్) మూవీ ట్రైలర్‌ను విడుదల చేసిన దుల్కర్‌ సల్మాన్‌

G.O.A.T (గోట్) మూవీ ట్రైలర్‌ను విడుదల చేసిన దుల్కర్‌ సల్మాన్‌

📰 Generate e-Paper Clip

ప్రముఖ హాస్య కథానాయకుడు  సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం G.O.A.T  (గోట్) GreatestOfAllTimes అనేది ఉపశీర్షిక.  దివ్యభారతి హీరోయిన్‌గా
నటిస్తున్న ఈ చిత్రానికి వేదవ్యాస్‌ దర్శకుడు.   మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణ‌వ్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత‌. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్‌
సినిమాస్‌ సమర్పణలో ఈ చిత్రం నవంబరు 12న థియేట్రికల్‌ విడుదల కానుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి కంటెంట్‌కు మంచి స్పందన వస్తోంది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ
కథానాయకుడు దుల్కర్‌ సల్మాన్‌ తన సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసి.. చిత్ర టీమ్‌కు శుభాకాంక్షలు అందజేశారు..
నిర్మాత మాట్లాడుతూ  ”సుడిగాలి సుధీర్‌ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెతో నిర్మించిన చిత్రమిది. ఆయన క్రేజ్‌కు తగ్గ కథను ఎన్నుకుని ఈ సినిమా నిర్మించాను. ఆయన పాత్ర నేటి యువత కనెక్ట్‌ అవుతుంది.
టెక్నికల్‌గా కూడా చిత్రం ఉన్నతస్థాయిలో వుంటుంది. సుడిగాలి సుధీర్  కెరీర్‌లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది.  సినిమా ఆద్యంతం ప్రతి ఫ్రేమ్‌ ఎంతో అద్భుతంగా ఉంటుంది. పూర్తి కమర్షియల్‌
అంశాలతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నేటి యువతను ఆలోచింపజేసే ఓ మంచి విషయం కూడా దాగి ఉంటుంది. తప్పకుండా ఈ చిత్రం  అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.
సుడిగాలి సుధీర్‌, దివ్యభారతి, సర్వధమన్‌ బెనర్జీ, నితిన్‌ ప్రసన్న, బ్రహ్యాజీ, పృథ్వీ, ఆడుకాలం నరేష్‌, రాజేంద్రన్‌, ఆనంద్‌ రామరాజ్‌, చమ్మక్‌ చంద్ర, పమ్మీ సాయి, నవీన్‌ నేని, తదితరులు నటిస్తున్న ఈ
చిత్రానికి
ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, నేపథ్య సంగీతం: మణిశర్మ,  డీఓపీ: ర‌సూల్ ఎల్లోర్‌, ఆడిషనల్‌ డీఓపీ: సన్నీ కూరపాటి, ఎడిటర్‌: విజయ్‌ ముక్తవరపు,  ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ : రాజీవ్ నాయర్, , కో
ప్రొడ్యూస‌ర్‌: సమైరా రెడ్డి.ఎన్‌, క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌:  ప్ర‌సూన మండ‌వ‌, దర్శకత్వం: వేదవ్యాస్‌, నిర్మాత: చంద్రశేఖర్‌ మొగుళ్ళ.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!