కమాన్ పూర్,అర్జున్ సమాచారం:
కమాన్ పూర్ మండలంలోని సుప్రసిద్ధ
స్వయంభూ శ్రీ ఆదివరాహ స్వామి జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా కొనసాగాయి. ఆలయ కమ్యూనిటీ హాల్లో స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి స్వామివారికి అభిషేకాలు, విశేష అలంకరణలు చేశారు. అనంతరం స్వామివారి సన్నిధిలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ముస్త్యాల దామోదర్ ప్రధానార్చకులు వరప్రసాదాచార్యులు, వేణుగోపాలచార్యులు, ఆర్జీ-3 జీఎం మధుసూదన్, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. స్వామి వారి వద్ద నిత్యాభిషేకం ఓ పూజ నిర్వహించారు.
నిత్య పూర్ణాహుతి తోపాటు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. స్వామి వారి జయంతి మూడవరోజు భక్తులు భారీ ఎత్తున హాజరయ్యారు. అలాగే మాదాసు రవీందర్ సుజాత దంపతులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో డైరెక్టర్లు తీగల రాజయ్య, భూష శ్రీనివాస్ గౌడ్, పిల్లి రాజు, గాజుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
======================
వైభవంగా స్వామివారి కల్యాణోత్సవం కమాన్ పూర్
RELATED ARTICLES

