ePaper
Monday, November 2, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్ట్రాఫిక్ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలి ముఖ్యమంత్రి ఎ. రేవంత్...

ట్రాఫిక్ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌, అర్జున్ సమాచారం:
హైదరాబాద్‌ను పరిశుభ్రమైన నగరంగా, ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. నగరంలో ఎక్కడా చెత్త కనిపించకూడదని, చెత్త సేకరణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ నివాసంలో మున్సిపల్ అధికారులతో వివిధ అంశాలపై ముఖ్యమంత్రి  సమీక్ష నిర్వహించారు. నగరంలో ప్రతిరోజూ ఇంటింటికీ చెత్త సేకరణ జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం వహించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.  నిర్మాణ వ్యర్థాల తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. మున్సిపల్ పరిధిలోని వివిధ పారిశ్రామిక ప్రాంతాల్లో చెత్త  సేకరణకు ఇండస్ట్రియల్ లోకల్ అథారిటీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.  నగరంలో నిర్మాణ పనులు, పార్కుల నిర్వహణ, ల్యాండ్‌ స్కేపింగ్‌, గార్డెనింగ్‌తో పాటు ఇతర పనులకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసే ఉద్దేశంతో ప్రారంభించిన గ్రీన్ ట్యాంకర్లను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి  అధికారులకు సూచించారు.
నిర్మాణ రంగం, గ్రీనరీ మెయింటెనెన్స్, పార్కుల అభివృద్ధి వంటి అవసరాలకు తాగునీటిని ఉపయోగిస్తున్నారని, దీనికి బదులుగా ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించడం ద్వారా తాగునీటిని ఆదా చేయవచ్చని అభిప్రాయపడ్డారు.  జలమండలి తొలివిడతలో 19 మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) నుంచి 28 గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిందని గుర్తుచేశారు. జీహెచ్ఎంసీతో పాటు సీఎంసీ, ఎంఎంసీ పరిధిలో గ్రీన్ వాటర్ సరఫరాను మరింత విస్తరించాలని సూచించారు.  నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టి ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి  అధికారులను ఆదేశించారు. సిగ్నల్ ఫ్రీ వ్యవస్థను తీసుకురావడానికి అవసరమైన చోట అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్‌లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
సాధ్యమైనంత వరకు సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్ నిలిచిపోకుండా వాహనాల రాకపోకలు నిరంతరాయంగా కొనసాగేలా చూడాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి తో పాటు హెచ్ఎండీఏ, మున్సిపల్ కార్పొరేషన్ల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
=======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!