ePaper
Saturday, August 22, 2026
ePaper
Homeజాతియంధనుష్ పొలిటికల్ ఎంట్రీ

ధనుష్ పొలిటికల్ ఎంట్రీ

📰 Generate e-Paper Clip

ఛెన్నై ,ఆగస్టు 22,అర్జున్ సమాచారం:
తమిళ స్టార్ ధనుష్ చుట్టూ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన చర్చ రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా ఆయన సోషల్ మీడియా ప్రెజెన్స్‌ను మరింత బలోపేతం చేసేందుకు.. రాజకీయ పార్టీల డిజిటల్ టీమ్స్ తరహాలో ప్రత్యేకంగా ఓ ఐటీ వింగ్ ఏర్పాటు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.ఈ డిజిటల్ టీమ్ కోసం దాదాపు ₹1 కోటి వరకు ఖర్చు చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ధనుష్‌కు సంబంధించిన కంటెంట్‌ను పర్యవేక్షించడం, ఫ్యాన్ బేస్‌ను మరింత యాక్టివ్‌గా మార్చడం, ఆయన కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి బాధ్యతలు ఈ టీమ్ చూసుకోనుందని టాక్.ఇది నిజమైతే.. కేవలం సినిమా ప్రమోషన్ కోసం ఏర్పాటు చేస్తున్న టీమ్ కంటే చాలా పెద్ద వ్యవస్థగా ఉండొచ్చనే చర్చ మొదలైంది. ముఖ్యంగా తమిళనాడులో రాజకీయ పార్టీల ఐటీ వింగ్స్ సోషల్ మీడియా నేరేటివ్, గ్రౌండ్ లెవల్ కమ్యూనికేషన్, డిజిటల్ క్యాంపెయిన్లలో కీలకంగా మారిన నేపథ్యంలో.. ధనుష్ కూడా అదే తరహా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారన్న వార్త ఆసక్తిని పెంచుతోంది.ఇప్పటికే ధనుష్ ఫ్యాన్ క్లబ్స్‌లో కదలికలు పెరిగాయి. సంక్షేమ కార్యక్రమాలు చేయాలని అభిమానులకు ఆయన పిలుపునివ్వడం, ఫ్యాన్ క్లబ్ కార్యకలాపాలు విస్తరించడం, కొన్ని ప్రాంతాల్లో వాటిని మరింత వ్యవస్థీకృతం చేయడం వంటి పరిణామాలు పొలిటికల్ ఎంట్రీ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.అయితే.. ధనుష్ రాజకీయాల్లోకి వస్తున్నారన్నది ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. ₹1 కోటి ఖర్చుతో ఐటీ వింగ్ ఏర్పాటు చేస్తున్నారన్న వార్తకు కూడా ధనుష్ లేదా ఆయన టీమ్ నుంచి అధికారిక ధృవీకరణ లేదు.కానీ వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. ధనుష్ విషయంలో అసలు సినిమా ఏంటి, పొలిటికల్ స్కెచ్ ఏంటి అనేది ఇప్పుడు తమిళనాట ఆసక్తికరంగా మారింది
================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!